పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 10లోగా విడుదల చేయనున్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఫలితాల విడుదలకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చే సమయం ఆధారంగా 8, 10 తేదీల మధ్య విడుదల చేస్తారు. జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించనున్నారు.
- ఇంటర్ ఫలితాలను జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫలితాలకు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మధ్య కనీసం నెలరోజుల సమయం ఉండాలి. అందుకే ఆగస్టులో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి భావిస్తోంది.
- జూనియర్ కళాశాలలు జులై 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
ఇవీ చదవండి: