Special story on Peddapalli SRR Rakhees: పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీల తయారీ కేంద్రం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇక్కడ 30 వేల రకాల రాఖీలు తయారు చేస్తున్నారు. రూపాయి నుంచి మూడు వందల ధర వరకు అందుబాటులో ఉంచుతున్నారు. 35ఏళ్లుగా రాఖీల వ్యాపారంలో కొనసాగిన కృష్ణమూర్తి.. ఆరేళ్ల క్రితం 30 మందితో తయారీ కేంద్రం ప్రారంభించారు. ఆన్లైన్, ఆఫ్లైన్.. మార్గాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. మొదట్లో పెద్దపల్లి పరిసర ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిద్వారా 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. సీజన్లో రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
మేం మొదటగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం. తర్వాత ఇంటి దగ్గర రాఖీలను తయారు చేసి తీసుకువస్తున్నాం. మహిళలు బయటకు వెళ్లకుండా ఉపాధి లభిస్తోంది. రోజుకు 350 రూపాయలు వస్తాయి. బయట పనికి పోకుండా ఈ పనే చేస్తున్నాం. సంవత్సరం పొడవునా పని ఉంటుంది. పిల్లలకు చేతి ఖర్చులకు వస్తోంది. ఏ రోజు డబ్బులు ఆరోజే ఇస్తారు. చాలా బాగుంది.- మహిళలు
raksha bandhan 2022: వ్యాపారులు గతంలో వరంగల్, హైదరాబాద్లోని బేగం బజార్ నుంచి రాఖీలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పెద్దపల్లికి తరలివెళ్తున్నారు. మిగతాచోట్లతో పోలిస్తే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. రాఖీలు మన్నికగా బాగున్నాయని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా క్రయవిక్రయాలు పెద్దపల్లి నుంచే జరుపుతామని వెల్లడించారు.