శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీల నీరు ఉంది . జలాశయానికి ఇన్ ఫ్లో లక్షా 69 వేలా 514 క్యూసెక్కులు వస్తుండగా... 2 లక్షలా 8 వేలా 787 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 4 గేట్ల ద్వారా లక్షా 11 వేలా 564 క్యూసెక్కులు, ఎడమగట్టు నుంచి 33,549, కుడిగట్టు నుంచి 30,848 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 30,000, హంద్రీ నీవా నుంచి 2026, కల్వకుర్తి నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
srisailam water flow : శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా అధికంగా ఉన్న వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 215టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 213.40 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద