శ్రీశైలానికి వరద ప్రవాహం..పది గేట్లు ఎత్తివేత - latest news of srisailam project
కృష్ణమ్మ మళ్లీ ఉరకలెత్తుతోంది. శ్రీ శైలం జలాశయానికి వరద కొనసాగడంతో... పది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
కృష్ణానదిలో వరదప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్వతున వరద వస్తుండటంతో... పది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4 లక్షల 60 వేల క్యూసెక్కులు కాగా... స్పిల్‌వే ద్వారా 2 లక్షల 79 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. ప్రవాహం స్థిరంగా ఉండటం వల్ల.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 78 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదలవుతోంది. శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం దాదాపు 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలుగా ఉంది.