తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ యాత్రకు వచ్చే భక్తులకు వసతి, ఆహార సౌకర్యాలను కల్పిస్తూ కాశీ విశ్వేరుడి సన్నిధిలో 60 ఏళ్లుగా సేవలందిస్తోంది శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం. లాక్డౌన్ కారణంగా ఆకలితో బాధ పడుతున్న వృద్ధులు, సాధువులకు ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్నారు. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తి త్వరగా తగ్గి ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కాశీ విశ్వేరుడిని ప్రార్థిస్తూ చండీ సహిత రుద్రహోమం చేశారు. ప్రతి శనివారం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. కరోనా సంక్షోభం తమ ఆశ్రమంపైనా పడిందని... సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉందని ఆశ్రమ ట్రస్టీ సుందర శాస్త్రి తెలిపారు. ఆశ్రమంలో వసతి సౌకర్యాలను నిలిపివేశారు.