ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణ మహోత్సవం

తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాలాలయంలో స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.

By

Published : Mar 22, 2021, 7:09 PM IST

Updated : Mar 22, 2021, 8:35 PM IST

sri laxmi narasinmha swamy Kalyanam
కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణ మహోత్సవం

కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణ మహోత్సవం

తెలంగాణలోని యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... శ్రీలక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తితిదే తరఫున తిరుమల ముఖ్య అర్చకులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపు రెండు గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకు ముందు స్వామివారు గజ వాహనంపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తాన నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళ సూత్రధారణ గావించారని... యాదాద్రి ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. యాదాద్రీశుడి కరుణా కటాక్షాలు అమ్మవారితో పాటు సమస్త లోకాలపై ఉంటాయని అన్నారు.

Last Updated : Mar 22, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details