ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Trains: మళ్లీ పరుగులు తీయనున్న ప్రత్యేక రైళ్లు

కరోనా వ్యాప్తి కారణంగా ఆపేసిన పలు రైల్వే సర్వీసులను ద.మ. రైల్వేశాఖ పునరిద్ధరించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ-గుంటూరు ప్రత్యేక రైలు జూలై 1 నుంచి, సికింద్రాబాద్-భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

TRAINS
TRAINS

By

Published : Jun 18, 2021, 6:51 AM IST

కాచిగూడ-గుంటూరు ప్రత్యేక రైలు జూలై 1 నుంచి యథావిధిగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాచిగూడ నుంచి బయలుదేరి మలక్​పేట్, ఫలక్​నుమా, బుద్వేల్, ఉందానగర్, షాద్​నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, వనపర్తి, శ్రీరాంనగర్, గద్వాల్, శ్రీబాలబ్రమరేశ్వర జోగులాంబ, కర్నూల్​సిటీ, వెల్దుర్తి, ధోన్, బేతంచర్ల, నంద్యాల్, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవపల్లె, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంబం, తర్లపాడు, మర్కాపూర్ రోడ్, గజ్జలకొండ, దొనకొండ, కురిచేడు, వినుకొండ, నరసరావుపేట, ఫిరంగిపట్నం, పెరిచెర్ల మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది.

సికింద్రాబాద్- భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈనెల 20 నుంచి యథావిధిగా అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది. గుంటూరు-రాజగడ ప్రత్యేక రైలు జూన్ 20 నుంచి నడుస్తుందని ద.మ.రైల్వే తెలిపింది.

ఇదీ చూడండి:నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details