దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లినవాళ్లు.. తిరిగి తమ గమ్యానికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
South Central Railway: దసరా ప్రయాణికుల కోసం.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే.. - దక్షిణ మధ్య రైల్వే వార్తలు
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అవి ఇవాళ, రేపు తిరగనున్నాయి.
special Trains for dussehra passengers
వివరాలివే..
- సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఉదయం 8.45 గం.కు ప్రత్యేక రైలు
- విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 3.55 గం.కు ప్రత్యేక రైలు
- సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య ఉదయం 9.50 గం.కు ప్రత్యేక రైలు
- నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 2.55 గం.కు ప్రత్యేక రైలు
- కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గం.కు ప్రత్యేక రైలు
- కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గం.కు ప్రత్యేక రైలు
ఇదీ చదవండి:heavy rains: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Last Updated : Oct 17, 2021, 7:39 AM IST