ఎవరినైనా కలిసినప్పుడు మనం మొదట చేసే పని వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అలవాటుగా మారిన ఈ సంప్రదాయం.. ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వమే గ్రీక్‌లో ఈ షేక్ హ్యాండ్స్ సంస్కృతి మొదలైందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ కాలం నాటి కొన్ని శిలాఫలకాల ఆధారంగా దీనిని ధ్రువీకరిస్తున్నారు. క్రీ.పూ 4 శతాబ్దంలో లభ్యమైన ఓ శిలా స్తూపంపై త్రాసీస్ అనే వీరుడు.. అతడి భార్యకు షేక్‌హ్యాండ్స్ ఇచ్చినట్లుగా చెక్కిన చిత్రాలున్నాయి. టర్కీలోని ఓ మ్యూజియంలో ఉన్న క్రీ.పూ 5వ శతాబ్దానికి చెందిన ఓ శిలపై ఇద్దరు సైనికులు కరచాలనం చేస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. గ్రీక్ పురాణాల ప్రకారం.. షేక్‌హ్యాండ్ ఇవ్వడమంటే ఇరువురూ సమానమే అన్న సందేశం ఇవ్వడమట. అలాగే తమ చేతుల్లో ఎలాంటి మారణాయుధాలు లేవని, శాంతిని కోరుకుంటున్నామని చెప్పడం కోసం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేవారట. క్రీ.శ 17వ శతాబ్దంలో వివాహ వేడుకలో వధూవరులు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటే వివాహం జరిగినట్లుగా భావించేవారట.
నమస్కారం...
నమస్కారం చేయడం భారత సంస్కృతిలో ఒక భాగం. కేవలం భారత్‌లోనే కాదు.. హిందుత్వ మూలాలు ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ నమస్కారం చేసే సంప్రదాయం ఉంది. నమస్కారం అంటే.. ఈ సమకాలీన యుగంలో ‘మీలోని దైవత్వానికి వందనం’ అని అర్థం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి.. నమస్కారం, నమస్తే, నమస్కార్ అని అంటుంటారు. ఈ పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. రుగ్వేదంలో పేర్కొన్న ‘నమస్కృత’కు ఆరాధన అని అర్థం. అదర్వణ వేదంలో పేర్కొన్న ‘నమస్కారా’కు భక్తి, ఆరాధన, గౌరవించడం అని అర్థాలున్నాయి. ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాల్లో కొన్ని విగ్రహాలు నమస్కారం పెట్టిన భంగిమలో కనిపిస్తాయి. అయితే ఈ సమాకాలీన యుగంలో నమస్తేకు మరో అర్థం ఉంది. నమః అంటే వందనం అని, తే అంటే మీకు అని అర్థం. భారతీయులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కనుక.. నమస్తే అంటే ‘మీలోని దైవత్వానికి వందనం’ అని అర్థమట. ఇక వీటికి ఆధారాలు గమనిస్తే.. క్రీ.పూ 3000 నుంచి 2000 మధ్య సింధు లోయ నాగరికతపై పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో నమస్కారం చేసి ఉన్న భంగిమలో ఉన్న అనేక విగ్రహాలను గుర్తించారు. ఈ నమస్కార భంగిమని అంజలి ముద్ర అని పిలుస్తారు. ప్రణమాసన యోగాలో అంజలి ముద్రతో భంగిమ ఉంటుంది.
సెల్యూట్...