ముదిచేర సావిత్రిబాయి... కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమితంతండా వాసి. టీటీసీ పూర్తి చేసిన సావిత్రిబాయి... 2019 ఆగస్టు 15వ తేదీన బ్రాహ్మణపల్లి పంచాయతీ గ్రామవాలంటీర్గా చేరింది. నాటి నుంచి తనకు కేటాయించిన వార్డులో క్రమం తప్పకుండా పింఛన్లు ఇవ్వటం సహా ఇతర ప్రభుత్వ సేవలను చేరువ చేయటంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ప్రమాదకరమని వారించినా....
అక్టోబర్ ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతకుముందు రోజు సావిత్రిబాయి పింఛన్ల సొమ్ము 60 వేల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్లింది. రాత్రి వర్షం మొదలైంది. వేకువజామునే పింఛన్లు ఇవ్వాలని సిద్ధమైంది. అందుకోసం తన స్వగ్రామం గుమితంతాండా నుంచి బ్రాహ్మణపల్లికి 5 కిలోమీటర్లు దూరం వెళ్లాలి. వర్షంలోనే తన తమ్ముడు తరుణ్ నాయక్ సాయంతో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు.
భారీ వర్షాల కారణంగా... మద్దిలేటయ్య వాగు ఉగ్రరూపం దాల్చింది. బ్రాహ్మణపల్లికి రావాలంటే కచ్చితంగా వాగు దాటాల్సిందే. వెళ్లటం ప్రమాదకరమని సోదరుడు వారించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సెక్రటరీ ప్రభాకర్ కు ఫోన్ చేశారు. వాగు దాటవద్దని... అవసరమైతే ఒకరోజు ఆలస్యంగా అయినా పింఛన్లు పంపిణీ చేయవచ్చని చెప్పారు. వాగు తగ్గుతుందేమోనని గంటసేపు ఎదురుచూశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. తన తోటి మరో వాలంటీర్ కరుణాకర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వెంటనే వాలంటీర్ వెళ్లారు. తమ్ముడిని ఇంటికి పంపించి... వాలంటీర్ సాయంతో ఆమె వాగు దాటారు.
అనుకున్న సమయానికి....