వాలైంటైన్స్ డే రెండు హృదయాలను కలిపే సందర్భమని అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. ఈవేడుకకు కాస్త ముందు, వెనుక రోజుల్లోనే ఎక్కువ జంటలు బ్రేకప్ చెప్పుకొని.. భగ్న ప్రేమికులుగా మారిపోతున్నారట. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు బ్రేకప్ సీజన్ అంటోంది ‘క్యుపిడ్ మంత్ర’ అనే సంస్థ అధ్యయనం. గిల్లికజ్జాలు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవటంలో తేడాలు, ఆశించింది దక్కకపోవడం... ఇలా అనేక కారణాలతో బ్రేక్ప్ చెప్పుకుంటున్నారట. ఏడాది మెుత్తంలో విడిపోయిన జంటల్లో 43 శాతం మంది ఈ ఆరు రోజుల్లోనే బంధానికి బై బై చెప్పేసుకుంటునారని 'క్యుపిడ్ మంత్ర' అధ్యయనం చెబుతోంది.
వాలైంటైన్స్ వీక్ కాదండోయ్.. బ్రేకప్ వీక్ - వీడిపోతున్న ప్రేమికులపై కథనం
వాలైంటైన్స్ అనే ఓ గొప్ప ప్రేమికుడిని స్మరించుకుంటూ.. తమ ప్రేమ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు.. ప్రేమజంటలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి7 నుంచి 14 వరకు వాలైంటైన్స్ వీక్ (ప్రేమికుల వారం)గా జరుపుకుంటారు. రోజ్డే, ప్రపోజ్డే, చాక్లెట్డే.. అంటూ రోజూకో ప్రత్యేకతతో తమ ప్రియులు/ప్రియుడితో వేడుకను నిర్వహించుకుంటారు. కానీ ఇవే రోజుల్లో భగ్న ప్రేమికులుగా మారుతున్న జంటల సంఖ్యా.. ఎక్కువే. ఎంటి ఆశ్చర్యంగా ఉందా.. ఇదీ నిజమండీ కావాలంటే ఓ సారి ఈ కథనం చదవండీ మీకే తెలుస్తుంది...
![వాలైంటైన్స్ వీక్ కాదండోయ్.. బ్రేకప్ వీక్ breakup story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10607915-375-10607915-1613196755572.jpg)
వాలైంటైన్స్ వీక్ కాదండోయ్.. బ్రేకప్ వీక్