ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 5:18 AM IST

ETV Bharat / city

ఓపీ సేవలకు సి-19 గది

అత్యవసర కేసులకు మాత్రమే ప్రత్యేక అవుట్ పేషెంట్ విభాగం ఏర్పాటుచేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. సి-19 పేరిట అవుట్ పేషెంట్ గదిని ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. వీటిల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీ చేపట్టాలని తెలిపింది. ఈ ఓపీల్లో సేవలందించే సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ, ఎన్​ 95 మాస్కులు ధరించాలని ఆదేశించింది.

Special out patient room for emergency services
అత్యవసర కేసులకు సీ-19 అవుట్ పేషెంట్ గది

అత్యవసర కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక అవుట్ పేషెంట్ విభాగం ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సి-19 పేరిట ఓ ప్రత్యేక అవుట్ పేషెంట్ గదిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వీటి కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. వైద్యులు, ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని... ఓపీలో పనిచేసే వారు తప్పనిసరిగా పీపీఈలు, ఎన్ 95 మాస్కులు ధరించి రోగులను పరీక్షించాలని సూచించింది. కరోనా లక్షణాలతో వచ్చినవారిని క్యాజువాలిటీ వార్డుల్లో చేరకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details