ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు పంపిస్తున్నారు. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, రూ.వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలామంది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం, 'దసరా పండగ' సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
CHALLAN: పెండింగ్ చలాన్ల చెల్లింపు కోసం 'ప్రత్యేక ఆఫర్'.. నిజమెంత? - viral news on pending challans
వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు దసరా సందర్భంగా 'ప్రత్యేక ఆఫర్' ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజం కాదని.. అది తప్పుడు వార్త అని తెలంగాణలోని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
challan
50 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అందులో ఉంది. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో నిర్వహించే 'ప్రత్యేక లోక్ అదాలత్' ద్వారా ఇలా చలాన్ల మొత్తాలను చెల్లించవచ్చని అందులో పేర్కొన్నారు. అయితే ఈ వార్త నిజం కాదని.. ఫేక్ న్యూస్ అని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:farmers problems: బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..!