ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్లేస్టోర్లో పిల్లల కోసం ప్రత్యేక విభాగం..! - గూగుల్ ప్లేస్టోర్​లో పిల్లల కోసం ప్రత్యేక విభాగం

ఇప్పుడు లాక్డౌన్. తర్వాత వేసవి సెలవులు. మొత్తంగా కొన్ని రోజులపాటు పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఆటలు.. పాటలు.. అటు తర్వాత డిజిటల్ విజ్ఞానాన్ని వారికి అందుబాటులో తెద్దాం అనుకుంటే.. గూగుల్ ప్లేస్టోర్లోని‘కిడ్స్ విభాగాన్ని తెరవండి..!! అది వారికే ప్రత్యేకం..

special feauture for kids
పిల్లల కోసం ప్రత్యేక విభాగం

By

Published : Apr 29, 2020, 5:22 AM IST

యాప్‌ కావాలన్నా ఆండ్రాయిడ్‌ యూజర్ల అడ్డా ప్లే స్టోర్‌. వెతికివెతికి ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అలాగే, పిల్లలకు ఉపయోగపడే యాప్‌లు ఏమున్నాయా..? అని ఓ కన్నేస్తుంటాం. పిల్లలు ఫోన్‌ అడిగితే ఆయా యాప్‌లను ఓపెన్‌ చేసి ఇస్తాం. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ పరిస్థితిలోనైతే పిల్లల్ని సముదాయించడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. అందుకేనేమో గూగుల్‌ ప్లే స్టోర్‌ ‘కిడ్స్‌’ విభాగాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఫోన్‌లో ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేస్తే అన్ని కేటగిరీలతో పాటు కిడ్స్‌ మెనూ కనిపిస్తుంది. దాంట్లో అన్ని విభాగాల వారీగా యాప్‌లు కనిపిస్తాయి. పిల్లల వయసుల వారీగా బ్రౌజ్‌ చేసి చూడొచ్ఛు చదువు, ఇతర విజ్ఞానపరమైన వాటి కోసం ప్రత్యేకంగా ‘లెర్నింగ్‌’ మెనూ ఉంది. ఫన్‌, ఇతర యాక్టివిటీ యాప్‌ల కోసం పలు విభాగాల్ని ఏర్పాటు చేశారు.

*టీచర్లతో రివ్యూ చేసినవే..

దైనా యాప్‌ పిల్లలు వాడుతున్నారంటే.. అది వారికి తగినదా? లేదా? అని పేరెంట్స్‌ కచ్చితంగా ఆలోచిస్తారు. అందుకే గూగుల్‌ కిడ్స్‌ విభాగంలో అందించే యాప్‌లను టీచర్లతో రివ్యూ చేయించారు. ప్రతి యాప్‌లోనూ Teacher approved అని కనిపిస్తుంది. పిల్లలు ఆడే గేమ్‌, మరే ఇతర యాప్‌ అయినా వయసుల వారీగా బ్రౌజ్‌ చేసి ఎంపిక చేసుకోవచ్ఛు ప్రస్తుతానికి ప్లేస్టోర్‌లో పిల్లలకు సంబంధించిన వాటిని ‘ఫ్యామిలీ’ విభాగంలో పొందొచ్చు.

వారికే ప్రత్యేకం..

* పిల్లల పుస్తకాలు

అమ్మా.. గుర్రాలెందుకు ఎగరవు? నాన్నా.. అబ్రహం లింకన్‌ ఎవరు?.. ఇలా మీ పిల్లలు ఎప్పుడైనా అడిగితే సమాధానం దాటేశారా? అయితే ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయండి. పేరు Epic!: Kid’s Books. అనేక రకాల పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయీ యాప్‌లో. కేవలం చదవడమే కాదు వినొచ్చు కూడా. అందుకు ఆడియో బుక్స్‌ ఉన్నాయ్‌. అంతేకాదు వీడియోలతో కొత్త విషయాలు తెలుసుకోవచ్ఛు పజిల్స్‌తో పిల్లల తెలివీ పెంచొచ్చు.

* లెక్కలు నేర్చుకుందాం

పిల్లలకు లెక్కలంటే భయమా..? 2+4 ఎంత? అనగానే దిక్కులు చూస్తూ నిలబడతారా? అయితే Math Kids యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని రోజూ కాసేపు మీ ఫోన్‌ మీ పిల్లలకిచ్చేయండి. లెక్కలను ఆసక్తిగా మారుస్తుందీ యాప్‌. చిన్ని చిన్న పజిల్స్‌, కూడికలు, తీసివేతలు, గుణకారాలు వంటివి సులభంగా నేర్పిస్తుంది.

* భూగోళాన్నీ చుట్టేద్దాం!!

ఆసక్తికరంగా ప్రపంచ దేశాల్ని పిల్లలకు పరిచయం చేద్దాం అనుకుంటే.. పలు దేశాల రాజధానులు.. వాటి స్వరూపాల్ని చూపిద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ యాప్‌ మీ బుడతడికి అవసరమే. పేరు Stack the States 2. దీంట్లో భూగోళ శాస్త్రంతో ఆటలాడొచ్చు అంటే తెలివికి తెలివి ఆటకి ఆట!!

* ప్లే స్కూల్‌కి హాలిడేనే..

అవును మీ పిల్లలు ప్లే స్కూల్‌కెళ్తున్నారా..? అయితే, వారికి స్కూల్‌లో మాదిరిగానే అక్షరాలు, పదాల్ని ఆకట్టుకునేలా చెబుదాం అనుకుంటే, The Very Hungry Caterpillar Play School యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. అక్షరాలతో మొదలు పెట్టి... బుజ్జాయిలకు అర్థమయ్యేలా అన్నీ బోధించొచ్చు.

ఇవీ చూడండి

3 గంటల 'బాహుబలి'ని 130 సెకన్లలో చూపిస్తే

ABOUT THE AUTHOR

...view details