నాటుసారా తయారీకి పాల్పడితే పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు తెరుస్తామని... కృష్ణా జిల్లా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వకుల్ జిందాల్ హెచ్చరించారు. బంటుమిల్లి మండలంలోని పలు తండాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. 3 వేల లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు జిందాల్ చెప్పారు. సారా తయారీని స్వచ్ఛందంగా విడిచిపెట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'నాటుసారా తయారీకి పాల్పడితే పీడీ కేసులు' - ap special enforcement raids on liquor shops
నాటుసారా తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కృష్ణా జిల్లా ఎస్ఈబీ అధికారి వకుల్ జిందాల్ హెచ్చరించారు. సారా తయారీని స్వచ్ఛందంగా విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.
special enforcement bureau