0ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై దృష్టిపెట్టామని ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేశామన్నారు. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులతో పాటు ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 955 మందిపై కేసులు.. 730 వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు.
'ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి' - ఏపీలో అక్రమ ఇసుక రవాణా తాజా వార్తలు
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్‌ఈబీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని స్పష్టం చేశారు.
special enforcement bureau commissioner vineeth brijlal on illegal sand and liquor