ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో అసంతృప్తి బాగా ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రంగుమారిన ధాన్యాన్ని కొనాలని ఈ విషయంపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో గుర్తుచేశారు. రవాణా ఛార్జీలు రైతుల ఖాతాల్లో పడడం లేదన్న ఆయన.. పొరపాటు ఎక్కడ జరుగుతుందో సరి చేయాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరు నాటికి జిల్లాలో వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో అసంతృప్తి: స్పీకర్ తమ్మినేని - tammineni latest news
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని.. రంగుమారిన, పాడైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు . ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో అసంతృప్తి: స్పీకర్ తమ్మినేని