RRR: రఘురామ సభాహక్కుల నోటీసుపై స్పందించిన స్పీకర్ కార్యాలయం
12:29 June 18
15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని నోటీసులు
ఏపీ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మాన నోటీసుపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంనుంచి వాస్తవ నివేదికను తెప్పించి 15 రోజుల్లోపు తమకు సమర్పించాలని లోక్‌సభ సచివాలయం కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులనిచ్చింది. ‘పోలీసు కస్టడీలో తనపై దాడిచేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు జూన్ 2న ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్, అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్, ముఖ్యమంత్రి జగన్‌లకు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదనకు నోటీసునిచ్చారు. ఇదే అంశంపై ఎంపీ కుమారుడు భరత్ మే15న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఏపీ ప్రభుత్వంనుంచి వాస్తవ నివేదిక కోరాం. ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఇచ్చిన ఇదే తరహా ఫిర్యాదులను కూడా జూన్ 8న హోం శాఖకు పంపాం. కస్టోడియల్ దాడి, చిత్రహింసలపై జూన్ 2న రఘురామకృష్ణరాజు నుంచి వచ్చిన తాజా నోటీసును కూడా హోంశాఖకు పంపుతున్నాం. ఇందుకు సంబంధించిన నివేదికను స్పీకర్‌కు సమర్పించాల్సి ఉన్నందున ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంనుంచి సంపూర్ణ వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని 15 రోజుల్లోపు మా కార్యాలయానికి పంపండి. అదే సమయంలో ఆ నివేదికను సభ్యుడికి యథాతథంగా ఇవ్వొచ్చా? లేదా? అన్నది చెప్పండి’ అని లోక్‌సభ సచివాలయం కేంద్ర హోంశాఖకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీచదవండి.