ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు.. రాగల 4 రోజులు అక్కడ భారీ వర్షాలు - దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Rains: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలంకంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

By

Published : Jul 23, 2022, 4:16 PM IST

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలంకంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఇవి రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట నుంచి ఒడిశాలోని గోపాల్​పూర్ వరకూ విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఒడిశా, చత్తీస్​గఢ్ నుంచి బంగాళాఖాతం వరకూ వేర్వేరు ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్​గడ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details