ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దూద్​ దురంతో ఎక్స్​ప్రెస్​ ద్వారా పాల సరఫరాలో రికార్డు - తెలంగాణ వార్తలు

దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా మార్చి 26 నుంచి పాల సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వరకు ఈ ప్రత్యేక రైలు పాల సరఫరా చేస్తోంది.

special train for milk transport
పాల సరఫరాకు ప్రత్యేక రైలు

By

Published : Dec 18, 2020, 5:54 PM IST

దూద్​ దురంతో ప్రత్యేక రైళ్లు ప్రారంభంలో రోజు విడిచి రోజు నడిచినప్పటికీ.. డిమాండ్‌ దృష్ట్యా జూలై 15 నుంచి రోజువారీగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. డిసెంబర్‌ 17 నాటికి 5 కోట్ల లీటర్లకుపైగా పాలు సరఫరా చేసింది. రేణిగుంట నుంచి దిల్లీకి పాలు సరఫరా చేసిందీ రైలు. దేశ వ్యాప్తంగా పాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించింది.

దీని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని దక్షిణ మధ్య రైల్వే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమ ప్రాధాన్యత ఇస్తూ.. రేణిగుంట, హజ్రత్‌ నిజాముద్దీన్‌ (2300 కి.మీ) మధ్య 30 గంటల్లో చేరుకునే విధంగా దూద్‌ దురంతో ప్రత్యేక రైలు నడిపింది. కేవలం 37 రోజుల్లోనే 4 కోట్ల లీటర్ల నుంచి.. 5 కోట్ల లీటర్ల పాలు సరఫరా చేయడం విశేషం.

ఇదీ చూడండి:కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ABOUT THE AUTHOR

...view details