ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పండగల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ముందస్తు టికెట్ రిజర్వేషన్..

Special Trains : దసరా, దీపావళి పండగల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 30 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది.

By

Published : Sep 30, 2022, 10:52 PM IST

Published : Sep 30, 2022, 10:52 PM IST

Special Trains For Dussehra And Diwali Festival
Special Trains For Dussehra And Diwali Festival

Special Trains For Dussehra And Diwali Festival : దసరా, దీపావళి పండగల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 30 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 2 నుంచి 30వరకు విశాఖపట్నం - బెంగళూరు మధ్య 5 , అక్టోబర్ 3 నుంచి 31 వరకు బెంగళూరు- విశాఖపట్నం మధ్య 5 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు, ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు నుంతి - విశాఖకు రైలు బయలు దేరనున్నట్లు తెలిపింది.

అక్టోబర్ 3 నుంచి 31 వరకు విశాఖపట్నం - తిరుపతి మధ్య 5, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 1 వరకు తిరుపతి - విశాఖపట్నం మధ్య 5 ప్రత్యేక రైళ్లు నడుపునున్నారు. ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి, ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి విశాఖపట్నంకు రైలు బయలుదేరనున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 2 మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్ -యశ్వంతపూర్, అక్టోబర్ 3 న మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంతపూర్ నుంచి నర్సాపూర్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 25 వరకు పూర్ణ- పందార్పూర్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అక్టోబర్ 4,11,18,25వ తేదీల్లో రాత్రి 9 గంటలకు పూర్ణలో ప్రత్యేక రైలు బయలుదేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 5 నుంచి 26 వరకు పందార్పూర్-పూర్ణ మధ్య 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 5,12,19,26 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పందార్పూర్​ నుంచి రైళ్లు బయలుదేరతాయని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details