ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SCR: తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే​ సరఫరా చేసిన ఆక్సిజన్ ఎంతో తెలుసా? - ఆక్సిజన్​ సరఫరా

కరోనా రోగులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రాణవాయువును భారీస్థాయిలో రాష్ట్రానికి రప్పించింది. వివిధ రాష్ట్రాల ద్వారా దాదాపు మూడు వేలకు పైగా మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ సరఫరాలో రైల్వే కీలక పాత్ర పోషించింది.

oxygen supply
తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే​ సరఫరా చేసిన ఆక్సిజన్ ఎంతో తెలుసా?

By

Published : Jun 15, 2021, 5:05 PM IST

తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్​ సరఫరాలో దక్షిణ మధ్య రైల్వే కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు తెలంగాణకు 3,052 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 33 రైళ్ల ద్వారా 163 ట్యాంకర్లలో ఆక్సిజన్​ చేరవేసినట్లు అధికారులు తెలిపారు.

వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్​ ట్యాంకర్లను తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలో ఒడిశా నుంచి 104 ట్యాంకర్ల ద్వారా 1,885 మెట్రిక్‌ టన్నులు, ఝార్ఖండ్‌ నుంచి 34 ట్యాంకర్లలో 680 మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌ఘఢ్ నుంచి 14 ట్యాంకర్లలో 282 మెట్రిక్‌ టన్నులు, గుజరాత్‌ నుంచి 11 ట్యాంకర్లలో 205 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువును రైల్వే శాఖ సరఫరా చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా 3,000 మెట్రిక్‌ టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్‌ను రైల్వే ఎక్స్‌ప్రెస్‌లు చేరవేశాయి. దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని తెలుగు రాష్ట్రాలకు 6,182 మెట్రిక్‌ టన్నులకు పైగా ప్రాణవాయువు సరఫరా చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:

mansas trust: రెండేళ్లలో ఎన్నో అలజడులు సృష్టించారు: అశోక్‌గజపతిరాజు

ABOUT THE AUTHOR

...view details