కరోనా ప్రభావం రైల్వే శాఖపై పడింది. ప్రయాణికులు రిజర్వేషన్లను రద్దు చేసుకుంటున్నారు. ఏసీ రైళ్లలో ప్రయాణించే వారిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే రైళ్లు బోసిపోతున్నాయి. కరోనా సెలవులు వచ్చినా.. రైల్వేలో ఆ కళ కనిపించడం లేదు.
కరోనా ఎఫెక్ట్: తగ్గిన ప్రయాణికులు.. పలు రైళ్లు రద్దు - coronavirus news
కరోనా వైరస్ ప్రభావంతో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. రిజర్వేషన్ చేసుకునే వారిలో కనీసం 30 శాతం కూడా లేకపోవడం వల్ల దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లను రద్దు చేసింది. ప్రభుత్వం కరోనా సెలువులు ప్రకటించినా.. ప్రజలు ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సుమారు రెండు లక్షల వరకు ప్రయాణికుల సంఖ్య తగ్గిన్నట్లు రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
![కరోనా ఎఫెక్ట్: తగ్గిన ప్రయాణికులు.. పలు రైళ్లు రద్దు south-central-railway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6460688-330-6460688-1584567723328.jpg)
ప్రయాణికులతోపాటు వచ్చే వారి రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫారం టికెట్ ధరను పెంచేసింది. 84 రైల్వే స్టేషన్లలో రూ.10 రూ.50కు, మరో 499 స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కు పెంచేసింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మార్చి 23 నుంచి 30 వరకు నడవాల్సిన 12 రైళ్లను రద్దు చేశారు. మార్చి18 నుంచి 31 వరకు ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉండడం వల్ల 17 రైళ్లను రద్దు చేశారు.
పలు రైళ్లు పక్షికంగా రద్దు
ఏప్రిల్ 1వ తేదీన ప్రయాణించాల్సిన నిజామాబాద్-పండాపూర్ రైలును పాక్షికంగా రద్దు చేశారు. మార్చి 19 నుంచి 23 వరకు వెళ్లాల్సిన 8 రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 18,19,21,22వ తేదీల్లో వెళ్లాల్సిన మైసూరు-బాలకోట్, బాలకోట్-మైసూర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వివిధ కారణాల వల్ల మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన వెళ్లాల్సిన హైదరాబాద్-పూణే, పూణే-హైదరాబాద్ మధ్య రైళ్లను రద్దు చేశారు. ఇలా మొత్తం 39 రైళ్లు రద్దయ్యాయి.
రద్దయిన రైళ్లు
- ముంబాయి ఎల్.టీ.టీ-అజ్నీ
- ముంబాయిఎల్.టీ.టీ-కరీంనగర్
- ముంబాయి సీఎస్టీ-నాగ్ పూర్
- కలబుర్గీ-హైదరాబాద్
- చెన్నయ్-సికింద్రాబాద్
- సంత్రగచ్చి-చెన్నయ్
- కాకినాడటౌన్-లింగంపల్లి
- మచిలీపట్నం-సికింద్రాబాద్
- హైదరాబాద్-ఎర్నాకులం
- హైదరాబాద్-విజయవాడ
- తిరుచిరపల్లి-హైదరాబాద్
- హెచ్.ఎస్.నాందేడ్-జౌరంగబాద్
- ఔరంగాబాద్-రేణిగుంట
- తిరుపతి-చెన్నయ్ సెంట్రల్
- కాన్పూర్ సెంట్రల్-కాచిగూడ
- విశాఖపట్టణం-సికింద్రాబాద్
- విశాఖపట్టణం-తిరుపతి
- సంబల్ పూర్-బనస్వడి
- భువనేశ్వర్-సికింద్రాబాద్
- విల్లుపురం-సికింద్రాబాద్
- జబల్ పూర్-తిరునవెళ్లి
దారి మళ్లించిన రైళ్లు
- యశ్వంత్ పూర్-అహ్మదాబాద్
- నాగర్ సోల్-ముంబాయి సీఎస్టీ
- ముంబాయి-సీఎస్టీ-తిరువనంతపురం
- టూటికోరిన్-ఓఖా