ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షాలిమార్​కు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే - దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు

నాగర్ సోల్ - షాలిమార్, త్రివేండ్రం - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ... రాష్ట్రంలోని విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

south central railway
south central railway

By

Published : Nov 17, 2020, 9:51 PM IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాగర్ సోల్ - షాలిమార్, త్రివేండ్రం - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు నాగర్ సోల్ - షాలిమార్ రైలు బయలుదేనుంది. ఈ నెల 25 నుంచి ప్రతి బుధవారం రాత్రి 11.50 గంటలకు షాలిమార్ నుంచి నాగర్ సోల్ కు ప్రత్యేక రైలు నడవనుంది.

అలాగే ఈ నెల 28 నుంచి ప్రతి గురు, శనివారాల్లో ఉదయం 11.55 గంటలకు త్రివేండ్రం నుంచి షాలిమర్ కు రైలు బయలు దేరుతుంది. డిసెంబర్ 1 నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో రాత్రి 11.50 గంటలకు షాలిమర్ నుంచి త్రివేండ్రంకు రైలును నడపన్నుట్లు వెల్లడించింది. ఈ రైళ్లన్నీ రాష్ట్రంలోని విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details