తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సినీనటుడు సోనూసూద్ కృతజ్ఞతలు తెలిపారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు చంద్రబాబు చెప్పిన మాటలు ఎంతో స్పూర్తినిచ్చాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. తనతో పాటు మరెంతో మంది ముందుకువచ్చి ఇతరులకు సాయం చేసేందుకు చంద్రబాబు చూపే చొరవ ఎంతో తోడ్పాటునిస్తుందని సోనూసూద్ ఆకాక్షించారు. త్వరలోనే తాను చంద్రబాబును కలుస్తానని వెల్లడించారు.
చంద్రబాబు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి - సోనూసూద్ తాజా వార్తలు
చంద్రబాబు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని నటుడు సోనూసూద్ తెలిపారు. త్వరలోనే ఆయనను కలుస్తానని చెప్పారు.

చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నటుడు సోనూసూద్