చిత్తూరు జిల్లా రైతు కుటుంబానికి సినీనటుడు సోనూసూద్ చేసిన సాయానికి తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఫోన్ చేసి సోనూసూద్‌ను అభినందించారు. మహల్‌రాజుపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి సాయపడటంపై ఈటీవీ భారత్ కథనం ప్రసారం చేయగా సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించారు. సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా చంద్రబాబు పేర్కొన్నారు. రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యత తెదేపా తీసుకుంటుందని తెదేపా అధినేత హామీ ఇచ్చారు.
'రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెదేపా తీసుకుంటుంది' - సోనూసూద్ తాజా వార్తలు
చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు పొలంలో... ఆయన కుమార్తెలే కాడెద్దులుగా మారారు దీనిపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి నటుడు సోనూసూద్ స్పందించి... రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందజేశాడు. చంద్రబాబు..సోనూ సూద్‌కు ఫోన్ ద్వారా అభినందించారు. రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెదేపా తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
'రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెదేపా తీసుకుంటుంది'