ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తోన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ని... సోనూసూద్ సందర్శించారు. అనిల్ అనే యువకుడు... తన చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను తొలగించి పూర్తి హైదరాబాదీ స్టైల్లో ఫుడ్ కోర్టును నిర్వహిస్తున్నాడు.
అభిమాని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్ సందడి - బేగంపేటలో సోనూసూద్ సందడి
ప్రముఖ సినీనటుడు సోనూసూద్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బేగంపేటలో సందడి చేశారు. తన పేరుతో పాస్ట్‌ఫుడ్ సెంటర్‌ని నడుపుతున్న ఓ యువకున్ని స్వయంగా వచ్చి కలిశారు. ఆ యువకున్ని ఆదర్శంగా తీసుకుని పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సోనూ... సూచించారు.
తనను చూసేందుకు వచ్చిన సోనూసూద్‌కు అనిల్ ఘనంగా స్వాగతం పలికాడు. ఫుడ్‌కోర్టును పరిశీలించిన సోనూ... వ్యాపార వివరాలు అడిగి తెలుకున్నాడు. తానే స్వయంగా ఎగ్‌ఫ్రైడ్ రైస్ చేసుకుని ఆరగించారు. అనిల్ వ్యాపారం లాభాల బాట పట్టాలని సోనూ ఆకాంక్షించారు. అనిల్‌ను మరికొంత మంది స్ఫూర్తిగా తీసుకొని... సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని కోరుకున్నారు.
తన అభిమాన నటుడు తనను కలిసేందుకు స్వయంగా రావటం ఎంతో సంతోషంగా ఉందని అనిల్ హర్షం వ్యక్తం చేశాడు. సోనూసూద్ తన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ని సందర్శించటం తన అదృష్టమని ఉప్పొంగిపోయాడు. సోనూను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తన అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకున్నారు.