కాళ్లు లేని భార్యను మోస్తూ ప్రయాణం సాగిస్తున్న మహేంద్ర, అతని ప్రేమను పొందుతున్న భార్య అన్నపూర్ణ గురించి సోమవారం ఈనాడులో ప్రచురితమైన కథనంపై సినీనటుడు సోనూ సూద్ స్పందించారు. ఈ వార్తను చూసిన వారు ట్విట్టర్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ జంటకు ఆర్థిక చేయూతనందించి ఉపాధి చూపుతానని తెలిపారు. వారి సమాచారం సేకరించి తగిన సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఆ దివ్యమైన జంటకు సాయమందిస్తా : ఈనాడు కథనంపై సోనూ ట్వీట్ - ఈనాడు కథనంపై సోనూ ట్వీట్ వార్తలు
కష్టం ఎక్కడుంటే అక్కడ సాయం చేసేందుకు నేనున్నాను అంటూ ముందుకు వస్తున్న నటుడు సోనూ సూద్ ఒక ప్రేమ జంటపై స్పందిచారు. కాళ్లులేని భార్యను మోస్తూ ప్రయాణం సాగిస్తున్న భర్త గురించి ఈనాడులో ప్రచురితమైన కథనంపై స్పందించారు. వారికి సాయం అందిస్తానంటూ ట్వీట్ చేశారు.
sonu sood tweet on eenadu article