రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లోని అంశాలు, గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ కూలాల ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. పేదలకు అమలు చేసే పథకాలను రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.
బడ్జెట్లోని అంశాలు, గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు - సోము వీర్రాజు తాజా సమాచారం
బడ్జెట్లోని అంశాలు, గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. జాతీయ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్లో పేదలకు మేలు చేసే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.
somu verraju
కరోనా బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా, ఇంజక్షన్లను సమకూర్చుకునేందుకు తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించాలనే తమ సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో విలువైన మత్స్య సంపదను కోల్పోతున్నామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై త్వరలోనే ఉద్యమం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:వైద్యారోగ్య శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్