ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 11న సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ - భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షులుగా సోము వీర్రాజు

ఈనెల 11న విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరుకానున్నారు.

Somu Veerraju
Somu Veerraju

By

Published : Aug 9, 2020, 4:09 PM IST

భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షులుగా సోము వీర్రాజు ఈనెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అఖిల భారత సంఘటన సహ కార్యదర్శి సతీష్ జీ హాజరు కానున్నారు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

పార్టీ నేతలతో కలసి భాజపా రాష్ట్ర వ్యవహారాల సహా ఇంఛార్జ్ సునీల్ దియోదర్ కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. కొవిడ్ నేపథ్యంలో కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం పంపినట్లు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ శ్రేణుల కోసం లైవ్ లింక్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details