రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన అన్ని సంస్థల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా తమ వంతు కృషి చేస్తామని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా శాఖమూరులోని నిడ్, మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాలను సోము వీర్రాజు పరిశీలించారు. ఎయిమ్స్ పూర్తిస్థాయి నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది లోపు ఎయిమ్స్ పూర్తవుతుందన్నారు.
'అమరావతిలో ఆ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తాం' - somu veerraju comments on Amaravathi
కేంద్రం మంజూరు చేసిన అన్ని సంస్థల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా తమ వంతు కృషి చేస్తామని... భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. నిడ్, మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాలను సోము వీర్రాజు పరిశీలించారు. వచ్చే ఏడాదిలోపు ఎయిమ్స్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో ఎయిమ్స్ తరహాలో ఒక్క నిర్మాణాన్ని అయినా పూర్తి చేసిందా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. చైనా, సింగపూర్, జపాన్ పేరుతో చంద్రబాబు కాలయాపన చేశారని విమర్శించారు. చంద్రబాబు ఖర్చు చేసిన 7 వేల 200 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న ప్లాట్లను వెంటనే అభివృద్ధి చేసి ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధానిలో అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
ఇదీ చదవండీ... 'పాలకులు మారినప్పుడల్లా... సంప్రదాయాలు మారవు'