రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది భాజపా స్పష్టమైన వైఖరితో ఉందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. గతంలో ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక మాట తప్పడాన్ని భాజపా ఖండిస్తోందన్నారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మాణాలు చేస్తే.. రాజధానిని ఎందుకు మారుస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి సరైంది కాదని తేల్చి చెప్పారు. రాజధానిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ఎయిమ్స్ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందన్నారు. కనకదుర్గ, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్లతో పాటు అనంతపురం, మచిలీపట్నం జాతీయ రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను కేంద్రం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో చేపట్టిందని గుర్తుచేశారు.
'రాజధాని అమరావతిలోనే ఉండాలి: సోము వీర్రాజు'
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనే స్పష్టమైన వైఖరితో భాజపా ఉందన్నారు. గతంలో అమరావతిలో రాజధానికి మద్దతు తెలిపి.. ఇప్పుడు జగన్ ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.
సోము వీర్రాజు