ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Somu Veerraju Letter to CM Jagan: 'అన్నమయ్య డ్యామ్‌ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి' - ap news

Somu Veerraju Letter to CM Jagan:ముఖ్యమంత్రి జగన్​కు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోవటం లేదని విమర్శించారు.

Somu Veerraju
Somu Veerraju Letter to CM Jagan

By

Published : Dec 6, 2021, 10:44 PM IST

Somu Veerraju Letter to CM Jagan: అన్నమయ్య డ్యాం వరదలలో కొట్టుకుపోవడంపై తక్షణం న్యాయ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి జరిగిన ఆర్థిక నష్టాన్ని వసూలు చేయాలన్నారు. ఈమేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనన్ ఇరిగేషన్ పై శ్రద్ధ పెట్టాలని కోరారు. కేంద్రం నిధులు ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు మినహా ఇరిగేషన్ వ్యవస్థను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాయలసీమ జిల్లాల్లో బ్రహ్మంసాగర్ కు అనుబంధంగా కాల్వలు నిర్మాణం చేయకపోవడంతో అక్కడ వేలాది ఎకరాల్లో సాగు జరగని పరిస్థితిని నెలకొందని లేఖలో ప్రస్తావించారు.

Somu Veerraju On Minor Irrigation: ఉభయ గోదావరి జిల్లాల్లో కాల్వల ఆధునీకరణ గత రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు సోము వీర్రాజు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత మైనర్ ఇరిగేషన్ పై కనీసం సమీక్ష జరిగిన దాఖలాలు కనపడడం లేదని లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాయలచెరువు విషయంలో వరదలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారన్నారు. సీమ ప్రాంతంలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అధ్వానంగా తయారుకావడానికి ప్రభుత్వ అలసత్వమే కారణమని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో గత సంవత్సరం వరదల సమయంలో ఒక గేటు కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. దశాబ్ధం క్రితం అన్నమయ్య ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Somu Veerraju On Annamayya Project: అన్నమయ్య, పింఛా కట్టల విధ్వంసం వెనకాల ఇసుక మాఫియా హస్తం ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. అన్నమయ్య జలాశయంలో ఉన్న నీటిని ముందుగా ఖాళీ చేసి ఉంటే ఈ విపత్తు జరిగేది కాదన్నారు. అలా వ్యవహరించని కారణంగా భారీ నష్టానికి కారకులయ్యారని లేఖలో వివరించారు. రెండు జలాశయాల విషయంలో న్యాయ విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:
CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details