Somu Veerraju: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వైకాపా నాయకుల అరాచకాలపై సీఎంకు లేఖ రాసినా పట్టించుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. ఆయన అనుచరుడు రజాక్ అక్రమాలకు పాల్పడతుంటే.. అధికారులు, ఈవో సహకరించారని.. వీర్రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా దందాకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. తమ పార్టీకి చెందిన నేత బుడ్డా శ్రీకాంత్‌పై తప్పుడు కేసులు బనాయించారని.. వాటిని ఎత్తివేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
అవసరమైనప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని తెర పైకి తెస్తున్నారు : సోము వీర్రాజు - సీఎం జగన్‌పై భాజాాపా అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు
Somu Veerraju: సీఎం జగన్‌పై భాజాాపా అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ తప్పులు బయట పడకుండా ఉండేందుకు .. అవసరమైనప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అరాచకాలపై సీఎం జగన్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు.
రాష్ట్రానికి తాము ఏం చేశామో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వ తప్పులు బయట పడకుండా ఉండేందుకు .. అవసరమైనప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇరుపార్టీల మోసాలను, కుటుంబ పాలనను ప్రజలకు వివరిస్తామన్నారు.
ఇదీ చదవండి:DGP meets CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి