ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల పేరుతో కోట్ల రూపాయలు దోచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏలూరులో ఆరోపించారు. జగన్ మోహన్‌రెడ్డి పరిపాలన.. అప్పుల పరిపాలన అని విమర్శించారు. రాష్ట్రంలో మతపరమైన పరిపాలన జరుగుతుందన్నారు. ప్రజల సొమ్ముతో చర్చి నిర్మాణాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులకు ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో ఇసుక బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని.. దానిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని సోము విమర్శించారు. రాష్ట్రంలో డూప్లికేట్ బ్రాండ్ల్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్సైజ్ శాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.