రాష్ట్రంలో ప్రచార ఆర్భాటం ఎక్కువైందని.. ఉద్యోగ క్యాలెండర్‌పై సీఎం చెప్పిందొకటి చేసేది మరొకటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. భాజపా నేతలు సోము, కన్నా, సునీల్ దేవ్‌ధర్ సమావేశంలో పాల్గొన్నారు.
'నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది' - bjp on water dispute between ap and ts
రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం దీటుగా స్పందించాలన్నారు. విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది.
!['నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది' somu veer raju comments on andhra pradsh state government ruling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12285933-716-12285933-1624861053406.jpg)
somu veer raju comments on andhra pradsh state government ruling
ఎక్సైజ్ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని అన్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నీటి కేటాయింపులో తెలంగాణ వివాదాలు సృష్టిస్తోందని విమర్శించారు. జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం దీటుగా స్పందించాలని అన్నారు. అన్ని పార్టీలు, నిపుణులతో చర్చించి పోరాడాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: