ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"పెగాసెస్ స్పైవేర్ చంద్రబాబు కొనుంటే.. వివేకా హత్య జరిగేదే కాదు" - Pegasus Spyware issue

Somireddy On Pegasus Spyware: తెలుగుదేశం నేతలు సహా కొందరి అధికారుల ఫోన్లను వైకాపా ట్యాప్ చేస్తున్నట్లు అనుమానంగా ఉందని తెదేపా నేత సోమిరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని... మాజీ డీజీపీ గౌతమ్ సవాంగే సమాధానమిచ్చారని సోమిరెడ్డి తెలిపారు. పీకేలు, కేకేలు వంటి వారు మమతా బెనర్జీతో అలా చెప్పించి ఉంటారని ఆరోపించారు.

Somireddy On Pegasus Spyware
Somireddy On Pegasus Spyware

By

Published : Mar 18, 2022, 10:43 PM IST

Somireddy On Pegasus Spyware: తెలుగుదేశం నేతలు సహా కొందరి అధికారుల ఫోన్లను వైకాపా ట్యాప్ చేస్తున్నట్లు అనుమానంగా ఉందని తెదేపా నేత సోమిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పరంగా కాకుండా వైకాపా పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై గతంలోనే తాము అనుమానాలు వ్యక్తం చేశామని వెల్లడించారు.పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్ అని మండిపడ్డారు. దేశాల మధ్య రహాస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీనే సమాధానమిచ్చారన్నారు. మమతా బెనర్జీకి ఈ పెగాసెస్ స్పై వేర్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చని తెలిపారు.

సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసింది..

పీకేలు... కేకేలు వంటి వారు మమతా బెనర్జీతో చెప్పించి ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. పెగాసెస్ స్పై వేర్ నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగి ఉండేదే కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్​ను కొనుగోలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు ఉన్నాయన్న సోమిరెడ్డి... దీనిపై సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసిందని తెలిపారు. విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయని తెలిపారు.పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్​ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరని వివరించారు. చంద్రబాబును లోకేశ్​ను పీకే తన వ్యూహాలతో... తీవ్రంగా డామేజ్ చేసి ఎడ్వాంటేజ్ తీసుకున్నారని దుయ్యబట్టారు. కోడికత్తి, వివేకా హత్య విషయంలో తెదేపాపై ఆరోపణలు వంటివి పీకే వ్యూహాలేనని ధ్వజమెత్తారు. బంగాల్‌ ఎన్నికల్లో మమత కాలుకు కట్లు కట్టించి రాజకీయం చేసింది పీకేనే అని తెలిపారు. పెగాసెస్ స్పై వేర్​ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీకి పీకేనే తప్పుడు సమాచారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. వైకాపా నేత చేసిన హ‌త్య: లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details