రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ఠ అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ తీరుతో కడుపుమండి రోడ్డెక్కిన అన్నదాతలపై ఇంత దారుణానికి ఒడిగడతారా అని మండిపడ్డారు. న్యాయస్థానం స్పందించి పోలీసుల తీరును ఎండగట్టి బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమని కొనియాడారు.
'అన్నదాతలపై ఇంత దారుణానికి ఒడిగడతారా..?' - అమరావతి రైతులు అరెస్ట్
రాజధాని ప్రాంత రైతులపై కేసులు నమోదవ్వడాన్ని తెదేపా నేత సోమిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న వారిపై ఇలాంటి చర్యలేంటని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి