ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను... తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలుగు భాష, యాస, ప్రాస, సంస్కృతి, ఉపన్యాసాలంటే ప్రపంచానికి గుర్తుకొచ్చే వ్యక్తిపై... జగన్ విమర్శలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నప్పుడు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి... ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకొని... ఆ స్థాయికి వెళ్లారని కొనియాడారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది పోయి... విమర్శిస్తారా అని ఆక్షేపించారు. మాతృభాష విలువ తెలియని వ్యక్తులు... వెంకయ్యను విమర్శించడం విడ్డూరంగా ఉందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
మాతృభాష విలువ తెలియని వ్యక్తులు వెంకయ్యను విమర్శిస్తారా..? - జగన్పై సోమిరెడ్డి విమర్శలు వార్తలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్లారని... తెలుగు భాష, యాస అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆయనేనని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై సీఎం జగన్ విమర్శలు చేయడం మంచిది కాదని సోమిరెడ్డి హితవు పలికారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి