తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో నైతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మేనని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. చావు తప్పి కన్ను లొట్టపోయి దొంగ ఓట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది గెలుపు కాదు.. బలుపని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. వైకాపా పతనం తిరుపతి నుంచే మొదలైందన్నారు.
రాయలసీమ వైకాపా ఎమ్మెల్యేలు మూడు లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తామంటూ బెట్టింగ్ లు కట్టించి కార్యకర్తల్ని ముంచేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెదేపా ఒక్క రూపాయి అయినా పంచకుండా మూడున్నర లక్షల ఓట్లు సంపాదించదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా.. వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.