రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరిస్తోందనటానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే రుజువని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఏపీలో ఏం జరుగుతుందని అడిగే పరిస్థితులు రావడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయడం లేదంటే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్టేనని స్పష్టంచేశారు. రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరించడానికి ఇదేమి నియంత రాజ్యం కాదు..ప్రజాస్వామ్యం అని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.
'ఇదేమి నియంత రాజ్యం కాదు... ప్రజాస్వామ్యమని గుర్తుంచుకోండి'
వైకాపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరిస్తోందనటానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇదేమి నియంత రాజ్యం కాదు...ప్రజాస్వామ్యమని వైకాపా గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తే.... పాలకుల కన్నా అధికారులే చిక్కుల్లో పడతారని సోమిరెడ్డి అన్నారు. అధికారులు ఇప్పటికైనా మేలుకోవాలని సూచించారు.
Somireddy chandramohan reddy
ఉన్నతాధికారులు పాలకుల వద్ద బానిసల్లా బతకడం కాదు. రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే...పాలకుల కన్నా అధికారులకు చిక్కుల్లో పడతారు. ఈ విషయాన్ని తెలుసుకుని ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రవర్తించండి. -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా నేత
ఇదీ చదవండి :గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం