రాజధానిని మార్చడం, 3 రాజధానులు పెట్టుకోవడం వంటి విషయాలు వైకాపా ఇష్టమని భాజపా మాట్లాడడం బాధాకరమని తెదేపా పొలిట్బ్యారో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజలు ఆవేదనతో కృంగిపోతూ ఇబ్బందులు పడుతుంటే ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
నిండు శాసనసభలో అమరావతికి ఆనాడు వైకాపా, భాజపాలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. రూ. 10వేల కోట్ల ఖర్చు జరిగిన అమరావతిని అర్ధంతరంగా మార్చేస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చుకోవాలన్నారు.