తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై కక్షసాధింపుతో పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ఇబ్బందుల్లోకి నెడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని వ్యక్తిగతంగా డిమాండ్ చేశారు. దీనివలన కేంద్రానికి మంచిపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ వైఖరి చూస్తుంటే నిర్మాణం మరింత సంక్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందారు. పోలవరం యథాతథంగా చేపట్టి ఉంటే తమకు అభ్యంతరం ఉండేది కాదనీ.. ప్రాజెక్టు ఆపేసే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయంలో రివర్స్ టెండరింగ్ సరికాదని హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు.
పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలి: సోమిరెడ్డి - tdp
'తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 73 శాతం పూర్తిచేశాం. నేడు వైకాపా ప్రభుత్వం చంద్రబాబు మీద కక్షతో ప్రాజెక్టును పట్టించుకోవట్లేదు. ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి' -- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి
పోలవరం నిర్మాణం కేంద్రమే చేపట్టాలి: సోమిరెడ్డి