సభాహక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రివిలేజేస్ అండ్ ఇమ్యూనిటీ కింద శాసనసభ్యులు స్వేచ్ఛగా మాట్లాడటంతో పాటు, స్వతంత్రంగా ఓటు వేసే హక్కు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కును ఎవరూ తప్పుపట్టేందుకు అవకాశం లేదని...కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదన్నారు. మంత్రి అనేది ఒక పొలిటికల్ పోస్ట్.. వారు ప్రభుత్వంలో ఒక భాగమన్నారు. 'రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్‌పై విమర్శలు చేసింది మీరు.. గవర్నర్‌కు ఎస్‌ఈసీ ఫిర్యాదు చేయడం తప్పా అని ప్రశ్నించారు. కోర్టుల్లో పదేపదే తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా సమీక్షించుకునే పరిస్థితిలో వైకాపా నేతలు లేరన్నారు.
సభాహక్కుల ఉల్లంఘన శాసనసభ్యులకే వర్తిస్తుంది: సోమిరెడ్డి - somireddy news
ఎస్ఈసీపై మంత్రుల వ్యాఖ్యలపై తెదేపా నేతలు సోమిరెడ్డి, అనగాని మండిపడ్డారు. సభాహక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుందని సోమిరెడ్డి తెలిపారు.
ఎస్ఈసీకు ప్రివిలేజ్ నోటీసులు రాజ్యాంగ ఉల్లంఘనే: అనగాని
ఎస్ఈసీపై మంత్రుల వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. ఫిర్యాదు చేసిందే తడవుగా.. విచారణకు రావాలని పిలవడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. ఎస్ఈసీకు ప్రివిలేజ్ నోటీసులు రాజ్యాంగ ఉల్లంఘనేనని అనగాని విమర్శించారు. గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీపై సభాహక్కుల చట్టం కింద చర్యలు కుదరవన్న వైకాపా, గవర్నర్ నియమించిన ఎస్ఈసీపై చర్యలపై నాలుక మడతేసి వ్యాఖ్యలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నియమాలు కాదని సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ పనితీరు ఉందని అనగాని మండిపడ్డారు.
ఇదీ చదవండి:'ఏకగ్రీవాలకు ఎస్ఈసీ వ్యతిరేకం కాదు'