గ్రామ సచివాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం, నిధుల లేమితో గ్రామపంచాయతీలు చేతులెత్తేయడంతో భవనాల్లో కొంత స్థలాన్ని అద్దెకిచ్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒక్కో సచివాలయ భవనంలో 50 చదరపు అడుగుల స్థలాన్ని స్టేషనరీ, జిరాక్స్ దుకాణాల నిర్వహణకు కేటాయించనున్నారు. వీటిపై వచ్చే అద్దెతో సచివాలయాల నిర్వహణతోపాటు స్టేషనరీ ఖర్చులనుంచి బయటపడొచ్చని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్లతో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు గురువారం నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయాల్లో స్థలాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఈలోగా ఏర్పాట్లు చేయాలని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సమాచారం. 50 చదరపు అడుగుల స్థలంపై నెలకు అద్దె రూ.వేయి, విద్యుత్తు ఛార్జీల కింద మరో రూ.200 చొప్పున మొత్తం రూ.1,200 రాబట్టాలన్నది ప్రణాళిక. దుకాణాల ఏర్పాటుకు స్థలాన్ని ఎవరికి ఇవ్వాలి? వారితో ఒప్పందం ఎలా చేసుకోవాలనే బాధ్యతలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో... స్టేషనరీ దుకాణాలు..! - గ్రామ సచివాలయాల్లో కొంత స్థలంలో దుకాణాల నిర్వహణ
ఇక నుంచి రాష్ట్రంలోని గ్రామ సచివాలయ భవనాల్లో కొంత స్థలాన్ని స్టేషనరీ, జిరాక్స్ దుకాణాల నిర్వహణకు కేటాయించనున్నారు. కలెక్టర్లతో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు గురువారం నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రామ సచివాలయాలు