క్రైస్తవుల ముసుగులో కొందరు.. చంద్రబాబుపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగన్ నాయకత్వంలో కొందరు, బ్రదర్ అనిల్ నేతృత్వంలో ఇంకొందరు ఈ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి, బ్రదర్ అనిల్‌కు ఉన్న సంబంధమేంటని జవహర్ నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్‌కు కడపలో బ్యాంక్ అకౌంట్ ఎందుకుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. క్రైస్తవ్యం ముసుగులో ప్రవీణ్ చక్రవర్తి వంటివారిని అడ్డుపెట్టుకొని బ్రదర్ అనిల్ తన వ్యక్తిగత సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని ఆరోపించారు.
'బ్రదర్ అనిల్ నేతృత్వంలో చంద్రబాబుపై విష ప్రచారం'
తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్ నాయకత్వంలో కొందరు, బ్రదర్ అనిల్ నేతృత్వంలో ఇంకొందరు విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి, బ్రదర్ అనిల్‌కు ఉన్న సంబంధమేంటని ఆయన నిలదీశారు.
Jawahar