అగ్మిపథ్ పేరుతో.. దేశంలోని నిరుద్యోగ యువత ఆశలపై.. కేంద్ర ప్రభుత్వం నీరు చల్లిందని.. వామపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం సొమ్ముతో.. ప్రైవేటు సంస్థలకు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసే ప్రక్రియ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో.. అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావ సదస్సు నిర్వహించారు.
'అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..' - undefined
అగ్మిపథ్ పేరుతో.. దేశంలోని నిరుద్యోగ యువత ఆశలపై.. కేంద్ర ప్రభుత్వం నీరు చల్లిందని.. వామపక్ష పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో.. అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావ సదస్సు నిర్వహించారు.
!['అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..' Left_Parties leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15625053-839-15625053-1655871743980.jpg)
వామపక్ష పార్టీల నాయకులు
ఎంపీ బినోయ్ విశ్వం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసరావు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన హామీతో అధికారంలోకి వచ్చిన భాజపా.. దాన్ని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన నిరుద్యోగులకు వామపక్షాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: