ముంబయిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. మంచి జీతం. అయినా చాలా రోజులుగా పెళ్లికావడం లేదు. ఎంతకీ తనకు పెళ్లికాకపోవడం వల్ల మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రాజ్‌కుమార్(28) ముంబయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొవిడ్ సమయంలో ఇంటికొచ్చి ఇక్కడి నుంచే పనిచేస్తున్నాడు.
SOFTWARE SUICIDE: పెళ్లికావడం లేదని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య - amaravati news
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డిలో జరిగింది.

SOFTWARE SUISIDE
జీవితంలో స్థిరపడిన రాజ్‌కుమార్‌కు... కుటుంబ సభ్యులు కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినప్పటికీ ఏదీ కుదరడం లేదు. ఎప్పటికీ పెళ్లికాదని మనస్తాపం చెందిన రాజ్‌కుమార్... ఇంట్లో దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
Last Updated : Aug 27, 2021, 5:59 PM IST