ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2021, 1:56 PM IST

ETV Bharat / city

హైదరాబాద్​లో ట్రాఫిక్ విధుల్లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తూ జీవితం హాయిగా సాగిపోతుందిగా.. చాలు అనుకోలేదు ఆయన. తన దినచర్యలో కొంత సమయం సమాజం కోసం కేటాయిస్తున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో కొంత కుదుర్చుకుని ట్రాఫిక్‌నూ నియంత్రిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు.

v
హైదరాబాద్​లో ట్రాఫిక్ విధుల్లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ వాలంటీర్‌(Software Engineer as Traffic volunteer)గా సేవలందిస్తున్న ముద్రగడ నాగేశ్వరరావుది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామం. హైటెక్‌ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు చౌరస్తాలో ట్రాఫిక్‌(Traffic controlling)ను నియంత్రించేవారు. ప్రస్తుతం ప్రగతినగర్‌లో ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తూ జేఎన్‌టీయూ చౌరస్తాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 2 గంటలపాటు ట్రాఫిక్‌ విధులు(traffic functions) నిర్వర్తిస్తారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ(Society for Cyberabad security council)))లో ట్రాఫిక్‌ వాలంటీర్లుగా 2,555 మంది సభ్యత్యం తీసుకోగా వారిలో నాగేశ్వరరావు తొలి సభ్యుడు.

ఇదీ చదవండి :ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details