ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: ఉద్యోగం పోయిందని ఉరి వేసుకున్నాడు!

By

Published : Sep 22, 2020, 11:15 AM IST

ఉద్యోగం పోయిందని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: He was hanged for lost his job
తెలంగాణ: ఉద్యోగం పోయిందని ఉరి వేసుకున్నాడు

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అభిలాష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్న అభిలాష్​... లాక్​డౌన్​ కారణంగా వర్క్​ ఫ్రమ్​ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం విధుల నుంచి తొలగిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై... మణికట్టు కోసుకొని, ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పట్టణంలో దర్జీలుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details